(#88) మా పెరట్లోని బిళ్ళగన్నేరు మొక్కలు😍 …

బిళ్ళగన్నేరు మొక్క… ముదురు ఆకుపచ్చని రంగులోని వీటి ఆకులు, అందంగా గులాబి రంగులో ఉండే వీటి పువ్వులుండే ఈ మొక్కలంటే నాకు చాలా ఇష్టం. నా చిన్నప్పుడు చాలా కనిపించేవి. ఎక్కడ పడితే అక్కడ పెరిగేవి. ఇప్పుడు కనిపించడం లేవు. అక్కడక్కడ ఎక్కడో ఒక చోట తప్ప! వీటిని బిళ్ళగన్నేరు మొక్కలంటారని ఈ మధ్యే తెలిసింది నాకు.

అయితే…. ఈ మొక్కలు మొన్నామధ్య మా ఇనిస్టిట్యూట్ ముందున్న రోడ్డుకు ఆవలివైపు కనిపించడంతో చాలా సంతోషమేసింది. అక్కడున్నవాటిలో ఐదు, ఆరు చిన్నిచిన్ని మొక్కలను నాతో పాటు ఇంటికి తెచ్చి, వాటిని మా పెరట్లో నాటాను. ఆ తరువాత పది, పన్నెండు రోజులకు పూలు పూయడం మొదలయ్యాయి. అప్పుడు తీసిన ఫోటో ఇది. అంత స్పష్టంగా లేదు.. !! ☺😍👇

క్రింద కనిపించే ఫోటోలు ఈ రోజు తీసినవి. ఇంకొంచెం బాగానే ఎదిగాయి. పూలు కూడా ఎక్కువగానే ఇస్తున్నాయి. 😍😍👇👇

By:- J Swethagodawari©®™

Date:- 12/02/2020

Image © J Swethagodawari